Wednesday, December 19, 2012

Mother is God

మాతృదేవోభవ





మనుషుల్లోనే కాదు ప్రతి జీవిలో తల్లి పాత్ర ఎంతో త్యాగంతో కూడుకొన్నది. పశు పక్షాదులు కూడా తాము తిన్నా తినకున్నా తమ పిల్లలకు ఆహారం వెతికి తెచ్చి పెడతాయి. ఎండా, వానా, చలి తగలకుండా, వేరే జంతువుల బారిన పడకుండా  పిల్లలకు భద్రత కల ప్రదేశంలో ఉంచి నిద్రాహారాలు మాని అవి పెద్దయ్యేవరకు కావలి కాస్తాయి. మాటలురాని ఆ పశు పక్షాదులే అంత ప్రేమానురాగాలు చూపితే, అన్నీ తెలిసిన అమ్మ అంతకు పది రెట్లు శ్రద్ధ చూపి పెంచి పెద్దవాన్ని చేయడమే కాదు, తానూ బ్రతికున్నంత వరకూ పిల్లలపై అనురాగం కురిపిస్తుంది. ఆ ప్రేమ వెలకట్ట లేనిది. ఆ అనురాగం గణించ లేనిది.

అమ్మ గొప్పతనం గురించి ఒక బ్లాగు రాయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. 4 years back ఒక బ్లాగు create చేసాను కూడా, మాతృదేవత అని బ్లాగుకు పేరు పెట్టి అమ్మ ఫోటోను పోస్ట్ చేశాను.  కానీ తరువాత ఏమి రాయాలో అర్థం కాలేదు, మా అమ్మను గురించి, ఆమె గొప్పతనం గురించే చెబితే అతిగా అనిపిస్తుంది అనిపించింది. మొన్న అమ్మ గొప్పతనాన్ని గురించి సువాణి ఎపుడో  పంపిన mail చదువుతూ ఇలాంటి విశేషాలతో రాయాలి అనిపించింది. కొత్తగా ఈ బ్లాగు create చేసి రాస్తున్నాను.

ఈ బ్లాగు background లో మహానటి సావిత్రి తన పిల్లలతో ఉన్న photo ఉంచడానికి కారణం - ఆమె తన పిల్లలపైన చూపిన ప్రేమానురాగాలు, ఆమె తల్లి ప్రేమను తెలయజేస్తూ స్వయంగా తన దర్శకత్వంలో నిర్మించిన మాతృదేవత చిత్రం కూడా-అమ్మ పదానికి పరి పూర్ణత్వం చేకూర్చిన మాతృమూర్తి ఆమె. ఆమెను చూస్తుంటే అమ్మ కనిపిస్తుంది. ఆమెలాగే మా అమ్మ కూడా చిన్న వయసులోనే చనిపోయింది - తను పొతే నేను ఏమవుతానో అన్న బెంగతోనే పోయింది.

ఎప్పుడూ నా కొరకే అలోచించి, నా కొరకే జీవించి వెళ్ళిన అమ్మకు ఈ బ్లాగు  అంకితం.


ఆ.వె.
కోటపల్లి వాసు కోటీశ్వరులయిన
శారదా బసప్ప సద్గతులకు
కన్న స్వప్నములను కల్ల జేయగ బుట్టె
అంబ స్వేద విద్య అవతిగాను

సీ.
పిన్న వయసు నుండె  పితృభక్తి గలిగి
.                మాతయే సర్వమన్ మదిన  యెంచి
నిత్యమ్ము ముప్రొద్దు నీశు గౌరిల గొల్చి
.                సతతమ్ము వారినే సన్నుతించి
సంగయ్య శివభక్తు సహ ధర్మ చారినై
               సతీ తిలకమై సేవ జేసె
మువ్వురు సంతానమున్ బొందె సంగమ
.                ణి ఉమాపతి మహేశు నీశు గృపన


తే.గీ.
వారల బెంచియున్ పెద్దవార జేసె
ఇద్దరు బిడ్డలకు పెళ్ళిళ్ళు జేసె
చిన్నవాడు మహేశుడు చిరుతగుండె
బడి నరగి  విద్యలన్ శ్రద్ధ బడయుచుండె.