Thursday, December 20, 2012

Ammanu minchi Daivamunnada - Song Lyrics

తల్లి గొప్పతనాన్ని చాటి చెప్పే గొప్ప పాట -  అమ్మను మించి దైవమున్నదా?

చిత్రం: 20 వ శతాబ్దం
రచన: సి.నారాయణ రెడ్డి
సంగీతం: జే .వి.రాఘవులు
పాడినవారు: S.P.బాలసుబ్రహ్మణ్యం, P.సుశీల

కొడుకు (బాలు):
అమ్మను మించి దైవమున్నదా? ఆత్మను మించి అద్దమున్నదా?

జగమే... పలికే.... శాశ్వత సత్యమిదే!
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!

తల్లి (సుశీల ):
రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా, తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణరాశి సీత లాగ తానూ, కోటి ఉగాదులే నా గడపకు తేవాలి
మట్టెలతో  నట్టింట్లో తిరుగుతుంటే... మట్టెలతో  నట్టింట్లో తిరుగుతుంటే....
ఇల లోగిలి కోవెలగా మారాలి

కొడుకు (బాలు): 
అమ్మను మించి దైవమున్నదా? ఆత్మను మించి అద్దమున్నదా?
జగమే పలికే శాశ్వత సత్యమిదే!
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే! అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!

తప్పటడుగులేసిన  చిననాడు, అయ్యో తండ్రీ అని గుండె కద్దు కున్నావు
తప్పటడుగులేస్తే ఈనాడూ, నన్ను నిప్పుల్లో నడిపించూ ఏనాడూ
నింగికి నిచ్చెన లేసే మొనగాడినే! నింగికి నిచ్చెన లేసే మొనగాడినే!
అయినా నీ ముంగిట అదే... అదే... పసివాడినే