Saturday, December 29, 2012

The End - Nirbhaya


 తల్లీ క్షమించు


రాజధాని డిల్లీ బస్సులో అమ్మాయిపై జరిగిన సాముహిక అత్యాచార ఘటన మరోసారి నిద్రిస్తున్న జాతిని జాగృతం చేసింది. పదిమంది కామందులు.... కాదు కాదు పశువులు అమ్మాయి అందమైన జీవితాన్ని - నలుగురికి ప్రాణంపోసే ఓ అమ్మను పశువుల్లా పైబడి హింసించారు.13 రోజులు మృత్యువుతో పోరాడిన "నిర్భయ" నేడు మరణించింది. మరో భారతం మళ్ళీ ముగిసింది. దోషులకు శిక్ష పడతుందో లేదో తెలియదు. పడ్డా స్త్రీ జాతికి ఒరిగేది, జరిగేది ఏమీ లేదు. సమస్యకు మూలాలను తుదముట్టించి నపుడే ఆ సమస్య సమసిపోయ్యేది. సమస్య వచ్చినపుడే సమాజం ప్రతిస్పందిస్తుంది, సమస్య మరుగున పడిపోగానే మళ్ళీ యధావిధె, ఆఖరుకు మీడియా కూడా మళ్ళీ ఆ సంఘటనను తెరపైకి తీసుకురాదు. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న పాపను కిడ్నాప్ చేసి ఫర్నేస్ లో వేసి కాల్చి వేసిన సందర్భంలో దోషులను బహిరంగంగా ఉరితీయాలని జనం బయటకు వచ్చి ఘోషించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షలు వేస్తామనీ అన్న అధికారులు, పాలకులు ఆఖరికి ప్రజలూ ఆ విషయాన్నే మరచిపోయారు.

నాటి నుండి నేటివరకు అబలలపై ఎన్ని అత్యాచార అమానుషాలు జరిగినా వాటిని నిరోధించగల పటిష్ట చట్టం నేటికీ రాలేదు అంటే ఎంత విడ్డూరం, అయినా చట్టాలు చేసే చట్టసభల్లోనే కామందులు ఉంటే చట్టాలు ఎలా తయారవుతాయి? అసలు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ బిల్లు తేవడానికే దశాబ్దాల నుండి ప్రయత్నం చేస్తూ, సహకారం కరువై నిస్సహాయులై ఇంకా ఆశా జీవులుగానే జీవిస్తున్న మన తల్లులు తమ భద్రతకై పటిష్ట చట్టాల తయారీకై, ఇంకా ఆశాజీవులు గానే మిగిలి పోవాల్సిందేనా? ఈ అత్యాచారాలకు అంతమనేది లేదా? 

అనునిత్యం అబలలపై ఎన్నో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి, అందులో నూటికి ఏ ఒకటో ప్రధానంగా తెరపైకి వస్తుంది, ఆ వచ్చినపుడే ఈ సమాజం నిద్ర నుండి మేల్కుంటుంది. ఆ మేల్కొన్న సమాజాన్ని పాలకులు మాయ మాటలతో మరుగున పడేసి మరిచిపోయేలా చేస్తూనే ఉన్నారు. అసలు సమస్యకు మూలం వెతికి అది ఎలా వస్తుంది, రావడానికి దారి తీస్తున్న పరిస్తితులేమిటి, వస్తే మళ్ళీ మరో మారు రాకుండా చేసే చట్టలేమి అనేవి అన్వేషించాలి. కాని నిజం చెప్పాలంటే మానసికంగా, శారీకంగా పరిపూర్ణ మానవత్వం పొందిన మానవుడు నేడు మానవత్వం నుండి మళ్ళీ తిరోగమనంలో పశుత్వం వైపు పయనిస్తున్నాడు అనిపిస్తుంది. అలా కాకుండా ఆపాలి, మద్యం మత్తు పాణీయాలు ఎరులైపారుతున్నాయి, వాటి మత్తులో వారెంచేస్తున్నారో వారికే అర్థం కాకుండా పోతుంది, వాటిని నిరోధించాలి. రెచ్చగొట్టే ప్రసార మాధ్యమాల విశృంకలత్వాన్ని నిరోధించాలి. తప్పు చేసి దొరికే నేరస్తులను మళ్ళీ వాటి జోలికి వెళ్ళకుండా ఉండే కఠినమైన శిక్షల విధించాలి.

అంతే కాదు ప్రతి మనిషి మదిలో మహిళ అంటే గౌరవం పెంపొందాలి - మహిళ అంటే మానవాళికి మూలం అని తెలిసి రావాలి. ఆ రోజు వచ్చేదెపుడో......... మానవులు మానవులుగా జీవించేదెపుడో.......


ఈ సంఘటనకి కూడా అన్ని సంఘటనల మాదిరే శుభం (The End) పలుకుతారా?
కాక మరో సంఘటన జరగకుండా చట్టాలు చేస్తారా?
మరి కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.............





ప్రతిఘటనలోని "దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో" ఈ పాట - ప్రతిఘటించే  శక్తి  లేక  రాలిపోతున్న  ప్రతి  స్త్రీమూర్తి  రోదనే............
ఎన్నేళ్ళు గడచినా అపురూపమైన అమ్మకు మానవ సమాజం ఇస్తున్న ప్రతిఫలం ఇదే!






Below Photos shared From: wikinewstime.com - Many Thanks to them