Thursday, January 3, 2013

Amma Annadi Oka Kammani Mata

Amma Annadi Oka Kammani Mata - Song Lyrics





Film: Bullemma-Bullodu
Lyrics: Dr.Dasharathi
Music: Satyam
Singers: S.P. Balasu, Bangalore Latha, Ramana,



బాలు:
అమ్మ అన్నదీ ఒక కమ్మని మాటా.....  అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూటా......
అమ్మ అన్నదీ ఒక కమ్మని మాటా.....  అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూటా...... మమతల మూటా......

దేవుడే లేడనే మనిషున్నాడూ..... అమ్మే లేదనువాడూ అసలే లేడూ........
దేవుడే లేడనే మనిషున్నాడూ..... అమ్మే లేదనువాడూ అసలే లేడూ........
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ......  తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ......
ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకూ..........

అమ్మ అన్నదీ....
లత: ఒక కమ్మని మాటా.....  అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూటా...... మమతల మూటా......
 
బాలు: అమ్మంటే అంతులేని సొమ్మురా........
లత: అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా......
బాలు: అమ్మ మనసు అమృతమే చిందురా...........
లత: అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా.......... ఉందిరా..........

బాలు, లత, రమణ: అమ్మ అన్నదీ ఒక కమ్మని మాటా.....  అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూటా...... మమతల మూటా......

లత:
అంగడిలో దొరకనిదీ అమ్మ ఒక్కటే....... అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే........
అంగడిలో దొరకనిదీ అమ్మ ఒక్కటే....... అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే........

బాలు:
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ?   అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ?
అమ్మ అనురాగం ఇక నుంచీ నీదీ..... నాదీ........

బాలు, లత, రమణ: అమ్మ అన్నదీ ఒక కమ్మని మాటా.....  అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూటా...... మమతల మూటా......